హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యలపై ఆరా: ఎమ్మెల్యే

W.G: పెనుమంట్ర మండలం ఓడూరు, భట్లమగుటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.