హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో ఎస్ఐఆర్-2026 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1,32,459 విచారణలు పూర్తయ్యాయని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.