హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాటన్ బ్యారేజీ వద్ద నీరు విడుదల

E.G: గత మూడు రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ఉద్ధృతి తగ్గుతోంది. గురువారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 3.39 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.