హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురం శివారులో చిరుత కలకలం

మార్కాపురం పట్టణ శివారులోని భ్రమరా వెంచర్స్ సమీపంలో గురువారం చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చెరువు వద్దకు నీటి కోసం చిరుత వచ్చి ఉండొచ్చని స్థానికులు అంచనా వేస్తున్నారు. చిరుత కదలికలపై అటవీశాఖ అధికారులు దృష్టి సారించి, ప్రజలను అప్రమత్తం చేయాలని స్థానికులు కోరుతున్నారు.