హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

కోనసీమ: పి.గన్నవరం మండలం మొండెపులంక గ్రామంలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో 33,906 మంది లబ్ధిదారులకు రూ. 14.57 కోట్ల విలువైన పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.