హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాఖల సమన్వయ లోపంతో పనుల్లో జాప్యం

RR: ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలోని అగమయ్య కాలనీలో రోడ్డు, డ్రైనేజీ పనులను కొప్పుల నర్సింహారెడ్డి కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. MMC, R&B, HMWS శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని ఆయన ఆరోపించారు. జోనల్ కమిషనర్ పరిశీలించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.