హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వం'

KKD: కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. 41వ డివిజన్ మల్లయ్య అగ్రహారంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధుల పింఛన్ రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచిందని తెలిపారు.