కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం BC రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చించి రిజర్వేషన్లను పునరుద్ధరిస్తే వైసీపీ నాయకులు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం'


