MDCL: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏ.ఎస్.రావు నగర్ మెడ్ ప్లస్ డయగ్నోస్టిక్ సెంటర్‌లో చోరీ జరిగింది. వైద్య పరీక్షల కోసం వచ్చిన ఒక మహిళకు చెందిన సుమారు 40 గ్రాముల బంగారు నగలు మాయమయ్యాయి. ఇంటికి వెళ్లాక నగలు కనిపించకపోవడంతో ఆ మహిళ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.
తెలంగాణ
డయగ్నోస్టిక్ సెంటర్‌లో మహిళ నగలు మాయం


