ATP: జిల్లాలో పెండింగ్ పడిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఈనెల 3వ తేదీన నిర్వహించాలని DEO అయూబ్ హుస్సేన్, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత నోటిఫికేషన్ నిబంధనలే అమలు చేయాలని సూచించారు. ఈ నెల 3న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు పాఠశాల ఎన్నికలను పూర్తి చేయాలని పాఠశాల హెచ్ఎంలను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 3న పెండింగ్ పాఠశాలల్లో ఎన్నికలు'


