హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రంలో కలెక్టర్ తనిఖీలు

CTR: తవణంపల్లి మండలంలోని మాధవరం పంచాయతీ స్వస్తిక్ నగర్‌లోని అంగన్వాడీ కేంద్రం, ఎంపీపీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం స్వస్తిక్ నగర్‌లోని ప్రజలను కలిసి మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం తదితర సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.