హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లాలో మద్యం, మాంసం దుకాణాలు బంద్

CTR: అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రేపు జిల్లాలో మద్యం, మాంసం దుకాణాలు మూసివేయునున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వైన్ షాపుల వారికి ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ పుంగనూరు సీఐ సురేశ్ రెడ్డి తెలిపారు. మాంసపు దుకాణాలు కూడా మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి గురువారం ఆదేశించారు.