హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

​వినుకొండలో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర'

PLD: వినుకొండ హనుమాన్ నగర్‌లో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. స్వయంగా చీపురుతో వీధులను ఊడ్చి పరిశుభ్రతపై చైతన్యం నింపారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం పరిశుభ్రత పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.