JGL: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్పీ తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో అక్టోబర్ 31 వరకు పోలీస్ యాక్ట్


