హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయినవిల్లి ఆలయానికి రూ. 40 వేల విరాళం

కోనసీమ: అమలాపురం మండలం ఓల్డ్ బండారులంకకు చెందిన చిక్కాల నాగ సత్య గణేష్ కుటుంబ సమేతంగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ. 40,000 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందించి శేషవస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు పాల్గొన్నారు.