హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేంద్రియ ఎరువుల వాడకం.. నేల సారానికి రక్ష

ADB: వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల సారాన్ని దీర్ఘకాలికంగా కాపాడుకోవచ్చని జామిడి సర్పంచ్ అశోక్, పంచాయతీ కార్యదర్శి విజయదుర్గ తెలిపారు. గ్రామ పంచాయతీ సెగ్రిగేషన్ షెడ్‌లో ఇంటింటా సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎరువును స్థానిక ప్రాథమిక పాఠశాలలోని కూరగాయల తోటకు ఉచితంగా అందజేసినట్లు పేర్కొన్నారు.