హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయితో పిల్లల భవిష్యత్తు నాశనం..!

NDL: శ్రీశైలం మండల కేంద్రమైన సున్నిపెంటలో గంజాయి వినియోగంతో యువత భవిష్యత్తు నాశనమవుతోందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని వారు ఆరోపించారు. ఇటీవల మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన కూడా చోటుచేసుకుందని తెలిపారు. గంజాయి, మద్యం అక్రమ విక్రయాలపై పోలీసులు దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.