హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం

CTR: పుంగనూరు పట్టణం ధోబి కాలనీలో గల వృద్ధాశ్రమంలో గురువారం కొత్తపేట అర్బన్ PHC డాక్టర్ రమ్యకృష్ణ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు BP, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. తర్వాత పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలు వస్తే దగ్గరలో ఉన్న PHC లకు వచ్చి వైద్య చికిత్సలు పొందాలని కోరారు.