హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుకు 21 గొర్రెలు మృతి

SS: ధర్మవరం రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో పిడుగుపాటుకు రైతు బిల్లే విజయ్‌కు చెందిన 21 గొర్రెలు మృతి చెందాయి. టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు నాయకులు మల్కాపురం గ్రామానికి వెళ్లి బాధిత రైతును పరామర్శించారు. ఘటన వివరాలను తెలుసుకుని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.