ASR: అరకువేలి మండలం పద్మాపురం సీపీఎం గ్రామశాఖలోని మహేష్, కుమార్‌లను పార్టీ నుంచి తొలగించినట్లు మండల కార్యదర్శివర్గ సభ్యుడు జే.భగత్ రామ్ తెలిపారు. వారు టీడీపీలో చేరినట్లు పత్రికల ద్వారా తెలిసిందన్నారు. ఇవాళ దుమ్మగూడ కాలనీలో జరిగిన పార్టీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సీపీఎం పార్టీ అభివృద్ధికి వారిద్దరూ పనిచేయలేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సీపీఎం నుంచి ఇద్దరు తొలగింపు'


