హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి పోటీలకు ఐదుగురు విద్యార్థులు

KRNL: పెరవలికి చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి SGF హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. నంద్యాలలో నిర్వహించిన పోటీల్లో 10వ తరగతి విద్యార్థులు హర్షవర్ధన్, అనూష, ప్రణవి, 8వ తరగతి విద్యార్థిని వైష్ణవి, 7వ తరగతి విద్యార్థి మహమ్మద్‌ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇస్తున్నట్లు PD విష్ణువర్ధన్‌తెలిపారు.