హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారుల అభివృద్ధికి రూ.25 కోట్లు: ఎమ్మెల్యే

ELR: పల్లె పండుగ 3.0 కింద పోలవరం నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఈ నిధులతో నియోజకవర్గంలో 27.28 కి.మీ బీటీ రోడ్లు, 8.50 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు.