హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 14న చలో హైదరాబాద్ కార్యక్రమం: గోడం గణేష్

ADB: షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆదివాసీ ఆత్మఘోష మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ అన్నారు. గురువారం పట్టణంలో సంఘం నాయకులతో సమావేశమై కార్యక్రమ గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.