హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదపుల్లేరులో ప్రపంచ వృద్ధుల దినోత్సవం

W.G: ఉండి మండలంలోని పెదపుల్లేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులను ఘనంగా సత్కరించారు. వృద్ధుల సేవలను కొనియాడుతూ, వారి అనుభవాలు సమాజానికి ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, శివరామరాజు, నరసరాజు, బ్రహ్మరెడ్డి, హరనాధరాజు, సీతారామరాజు, రాము, తదితరులు పాల్గొన్నారు.