అన్నమయ్య: పెద్దమండ్యం మండలం కలిచేర్ల పంచాయతీ పరిధిలోని ఎర్రగుట్ట పల్లెలో నూతనంగా ప్రతిష్ఠించిన ఆంజనేయస్వామి ఆలయంలో 42 రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజను వైభవంగా నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, నాగవల్లితో అలంకరించి వేదమంత్రాల నడుమ అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ మరియు అన్నదానం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా ఆంజనేయస్వామికి మండల పూజ


