హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు హక్కు రక్షణకు ముమ్మర చర్యలు: కలెక్టర్

వికారాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్షాళన పనులు వేగంగా సాగుతున్నాయి. చిరునామా సరిగా లేని సుమారు 2.67 లక్షల మందిని గుర్తించిన అధికారులు, 98 శాతం మందికి నోటీసులు అందించారు. ఓటు రద్దు కాకుండా అక్టోబర్ 9లోపు కుటుంబసభ్యులు అవసరమైన ఆధారాలు సమర్పించాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. స్పందించని వారి ఇళ్లకు బీఎల్వోలను పంపుతామని తెలిపారు.