హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాల్వశ్రీరాంపూర్ మండలంలో భూ రీసర్వే

PDPL: గ్రామాల్లో జరుగుతున్న భూ సర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావడానికి రైతులందరూ అధికారులకు సహకరించాలని కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ రాముడు కోరారు. కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జీపీ ఆవరణలో భూ రీసర్వేపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు తహసీల్దార్ రాముడు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు భూ సర్వే ప్రముఖ్యతపై అవగాహన కల్పించారు.