BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం అశ్వాపురం మండలం బుడుగు బజార్‌కు చెందిన రాంపూడి నాగమణికి వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. అనారోగ్యంతో చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగమణి కుటుంబానికి ఈ సాయం అందింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
'బాధితుడికి రూ.5 లక్షల LOC అందజేత'


