హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎం సూర్య ఘర్‌పై అవగాహన సదస్సు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని విద్యుత్ ఉపకేంద్రంలో గురువారం పీఎం సూర్య ఘర్ ముఫ్ బిజిలి యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యుత్ శాఖ డీఏఈ దానయ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు విధానం, ప్రయోజనాలు, బ్యాంకు రుణ సౌకర్యాలు, ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంపై బ్యాంకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సారంగపాణి, పాల్గొన్నారు.