NLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన మంద వేణుగోపాల్ రెడ్డిని నియమించినట్లు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ప్రకటించారు. సంస్థ ఆశయాలు, ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల సాధన కోసం ఆయన చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.
తెలంగాణ
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వేణుగోపాల్ రెడ్డి


