ADB: సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల పాత్ర కీలకమైందని, వారి అనుభవం రాబోయే తరాలకు మార్గదర్శకమని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పి హాల్లో గురువారం నిర్వహించిన వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధులకు సమాజంలో తగిన గౌరవం, భద్రత, మరియు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
తెలంగాణ
సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల పాత్ర కీలకం: MP నగేశ్


