హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కౌలాస్‌నాలా నుంచి నీటి విడుదల'

KMR: కౌలాస్‌నాలా ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా దిగువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ సుకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 457.75 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం 1.176 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, పూర్తి సామర్థ్యం 1.237 టీఎంసీలు. ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లో లేదని ఏఈ తెలిపారు.