హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణా..రెండు ట్రాక్టర్ల సీజ్

BDK: కొల్లుగూడెం ఇసుక ర్యాంపు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గురువారం రెవెన్యూ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహించిన అధికారులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.