జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో గురువారం పొలానికి వెళ్లిన రైతు బుచ్చన్న(58) తెగిపడిన ఎల్టీ వైరు తగిలి విద్యుదాఘాతంతో అపస్మారక స్థితికి చేరాడు. తోటి రైతులు ఆస్పత్రికి తరలించారు. అధికారులు వైర్లను పర్యవేక్షించాలని రైతులు కోరారు. ఆస్పత్రిలో బుచ్చన్నను మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ మహేష్ ఉన్నారు.
తెలంగాణ
విద్యుదాఘాతంతో రైతుకు తీవ్రగాయాలు


