KMR: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నిజాంసాగర్ మండలం అరేపల్లిలో సర్పంచ్ నందాస్ మోహన్ స్వయంగా చీపురు పట్టి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. సిబ్బందితో కలిసి ప్రధాన రహదారులను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు. గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా సహకరించాలని కోరారు.
తెలంగాణ
అరేపల్లిలో స్వచ్ఛతపై అవగాహన


