హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ ఆర్టీసీ ఎంక్వయిరీ నంబర్ విడుదల

మెదక్ ఆర్టీసీ బస్సుల సమాచారం కోసం ప్రయాణికులు ఎంక్వయిరీ నంబర్‌ను సంప్రదించాలని డిపో మేనేజర్ పరమేశ్వరి తెలిపారు. బస్సుల వేళలు, ప్రయాణ వివరాల కోసం న్యూ బస్టాండ్ నంబర్ 7842651529 అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రయాణికులు ఈ ఫోన్ నంబర్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.