హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేద సంస్కృతి పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే

SRD: ​హైదరాబాద్‌లోని బ్రాహ్మణ సంక్షేమ భవన్‌లో నిర్వహించిన చతుర్వేద సదస్సులో గురువారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం, వేద సంస్కృతిని కాపాడటంలో బ్రాహ్మణుల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోరే వేద విద్యను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.