KMM: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. కరుణగిరి వద్ద అనుమానాస్పదంగా నిలిపి ఉన్న ఓ లారీని అధికారులు తనిఖీ చేయగా, అందులో భారీగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. లారీలో తరలిస్తున్న 260 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు, గంజాయితో పాటు లారీని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి లారీ డ్రైవర్, క్లీనర్‌ను అరెస్ట్ చేశారు.
తెలంగాణ
VIDEO: 260 కిలోల గంజాయి పట్టివేత


