హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

WGL: నర్సంపేట పట్టణానికి చెందిన వల్లబ్ నగర్ వాస్తవ్యులు షేక్ యాకుబ్ కోడలు అమీన ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ నాళ్ళం విజయ్ కుమార్ గురువారం ఉదయం వారి కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే మృతురాలి చిత్రపటం వద్ద నివాళి అర్పించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.