హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరగాళ్ల మోసం.. మహిళ ఖాతాలో డబ్బు మాయం

ASF: సైబర్ నేరగాళ్ల మోసంతో కాగజ్ నగర్ పట్టణానికి చెందిన బొల్లిశెట్టి అరుణ ఖాతాలో నుంచి రూ.50 వేలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతనెల 28న ఒక్క రూపాయి డెబిట్, క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆమె అనుమానంతో బ్యాంక్ వెళ్లి సర్వీస్ నిలిపివేయాలని ఫిర్యాదు చేయగా వారు నిలిపివేయలేదు. మరుసటి రోజు ఆమె ఖాతా నుంచి రూ. 50వేలు డెబిట్ అయినట్లు బాధితురాలు తెలిపారు.