హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ నిధుల అక్రమాలపై విచారణ.. ?

MLG: జిల్లాలో పంచాయతీ నిధుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 24న వెంకటాపురం మండలం సురవీడు పంచాయతీలో అక్రమాలు నిర్ధారణ కావడంతో సర్పంచ్, ఉపసర్పంచ్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా ఏటూరునాగారం మండలం రోహిరు పంచాయతీలోనూ అక్రమాలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారంపై అధికారులు రెండు రోజులుగా విచారణ చేపడుతున్నారు.