హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి

SRPT: సూర్యాపేట మండలం టేకుమట్లలో దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని ఇవ్వాళా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గట్టు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మొరిశెట్టి లక్షాది హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.