హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గుర్రంగడ్డ వంతెన పనులు పూర్తి చేయాలి'

గద్వాల మండలం గుర్రంగడ్డ వద్ద కృష్ణానదిపై కొనసాగుతున్న వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. వంతెన అందుబాటులో లేక రాత్రివేళ నదిని దాటి రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నామని తెలిపారు. పనుల్లో వేగం పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.