హైదరాబాద్: 28°C
తెలంగాణ

100 సంవత్సరాల పైగా జీవించి.. మృతి

సిద్దిపేట: వందేళ్లకు పైగా జీవించి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న అన్నాడి కృష్ణారెడ్డి (105) గురువారం కన్నుమూశారు. బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌కు చెందిన ఆయనకు ఇద్దరు కుమారులు, మనుమలు ఉన్నారు. మూడు తరాలను కళ్లారా చూసిన కృష్ణారెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు విషాదంలో మునిగారు. శతాధిక వయసు వరకు జీవించిన ఆయన జీవిత ప్రయాణం గ్రామస్తులను ఆకట్టుకుంది.