హైదరాబాద్: 28°C
క్రీడలు

గ్రీకో-రోమన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన నితీశ్

ఆసియా గేమ్స్‌లో భారత రెజ్లర్ నితీశ్ సివాచ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల గ్రీకో-రోమన్ 97 కేజీల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో మంగోలియా రెజ్లర్‌పై 9-0 తేడాతో నితీశ్ ఘన విజయం సాధించాడు. ఆసియా క్రీడల చరిత్రలో సుమారు 64 ఏళ్ల తర్వాత గ్రీకో-రోమన్ విభాగంలో ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ రెజ్లర్‌గా నితీశ్ రికార్డు సృష్టించాడు.