GDWL: ఇటిక్యాల మండలం సాతర్ల శివారులోని వంతెన సమస్యతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన ఏటవాలుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. అప్రోచ్ పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రమాదాల భయం ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి వంతెన పనులు పూర్తిచేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
సాతర్ల వంతెన పనులు పూర్తి చేయాలని డిమాండ్


