KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం రాత్రి బొడ్డెమ్మ పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మంథని సుభాష్‌నగర్ మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పుట్టమన్నుతో ఐదు, ఏడు లేదా తొమ్మిది అంతస్తుల బొడ్డెమ్మను తయారు చేసి, పూలతో అలంకరించి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. 9వ రోజు నిమజ్జనంతో వేడుకలు ముగియనున్నాయి.
తెలంగాణ
ప్రకృతి ఆరాధనకు ప్రతీక బొడ్డెమ్మ పండుగ


