హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి సెమీఫైనల్.. 13 ఓవర్ల మ్యాచ్

ఆసియా గేమ్స్ క్రికెట్ తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఓవర్లను 13కి కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన BAN 13 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్ తౌహిద్ హృదయ్ 42 పరుగులు చేయగా, PAK బౌలర్ మోకిమ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 'IND vs SL' విజేతతో ఫైనల్లో తలపడనుంది.