హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని వినతి

WNP: దివ్యాంగుల పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా UDAY కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కలెక్టర్ ఆదర్శ సురభికి వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఖాళీల గుర్తింపు, నోటిఫికేషన్ ప్రకటనను ప్రత్యేక ప్రాధాన్యంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.