హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇంట్లోకి చొరబడి వ్యక్తి గొంతు కోసి హత్య

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేటకు చెందిన రాచకొండ సత్తయ్యను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. అతడి ఇంట్లోకి వచ్చిన దుండగులు సత్తయ్య గొంతు కోశారు. సత్తయ్య గాయాలతో బయటికి రావడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.